ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

పరీక్షల్లో పాస్ అయిన 70.63 శాతం మంది

ap-inter-supplementary-results

అమరావతిః ఏపి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఎంవీ శేషగిరి బాబు ఫలితాలను విడుదల చేశారు. ఆగస్ట్ 3 నుంచి 12వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. జనరల్ ఇంటర్ తో పాటు ఒకేషనల్ ఫలితాలను కూడా విడుదల చేశారు.

ఈ పరీక్షకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 70.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్ లో 35 శాతం, ఒకేషనల్ లో 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్ జనరల్ లో 33 శాతం, ఒకేషనల్ లో 46 శాతం మంది పాస్ అయ్యారు. పరీక్షా ఫలితాలను www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వెబ్ సైట్లలోకి లాగిన్ అయి చూసుకోవచ్చు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/