నేడు ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల

ఇంటర్ పరీక్షలు రాసిన 4,64,756 మంది విద్యార్థులు

అమరావతి: నేడు ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఏడాది జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ ఏడాది మే 6 నుంచి 24 వరకు పరీక్షలు జరిగాయి. 4,64,756 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in లోకి వెళ్లి వారి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

ఈసారి ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డు ఇవ్వనున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో 33 కంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్ షిప్స్ కు అర్హులవుతారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/