అఖిలపక్షం నేతలకు సుచరిత అపాయింట్‌మెంట్ నిరాకరణ

సుచరిత తీరుపై నేతల మండిపాటు

mekathoti sucharitha
mekathoti sucharitha

అమరావతి: ఏపి హోం మంత్రి మేకతోటి సుచరితను కలిసేందుకు ప్రయత్నించిన అమరావతి పరిరక్షణ సమితి నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు సుచరిత నిరాకరించారు. ఏపీ రాజధానిని అమరావతిలో కొనసాగించాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందిస్తున్న అమరావతి పరరక్షణ సమితి నేతలు.. అందులో భాగంగా హోం మంత్రికి కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు సుచరిత నిరాకరించడంతో జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీరు సరికాదని మండిపడుతున్నారు. కాగా ఖిలపక్షం నేతలు వినతిపత్రం సమర్పించేందుకు హోంమంత్రి ఇంటికి వస్తారన్న సమాచారంతో అక్కడ పోలీసులు మోహరించారు. హోంమంత్రి ఇంటివద్ద ఎలాంటి అవాఛనీయ సంఘనటు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/