ఏపీలో 1-9వ తరగతి విద్యార్థులకు సెలవులు

యధావిధిగా టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్‌ వెల్లడి

ap-Holidays for 1st to 9th grade student
School Children -File

Amravati: ఏపీలో రేపటి నుంచి 1 నుంచి 9వ తరగతి పాఠశాలల విద్యార్థులకు సెలవులు ప్రకటించినట్లు మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వైయ‌స్ జగన్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేశ్ ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు.ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 24 నాటికి పూర్తవుతున్నాయని, ఆపై థియరీ పరీక్షలు మే 5 నుంచి 23 వరకు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్నారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని,. అయితే, 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం పూర్తయిందని తెలిపారు. కరోనా నిబంధనలను పూర్తిస్థాయిలో పాటిస్తూనే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుపుతామని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/