సంచయితకు హైకోర్టులో షాక్

అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా పునర్నియమించాలని హైకోర్టు ఆదేశం

అమరావతి: మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతి నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. గతంలో ఏపీ ప్రభుత్వం  జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ.. సంచయిత గజపతిరాజు నియామకం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. జీవోలను సవాల్ చేస్తూ అశోక్‌గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఏపీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. పాత జీవోల ప్రకారం మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా అశోక్ ఉంటారని పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/