పేదల ఇళ్ల పట్టాల పంపిణీపై పిటిషన్‌..తీర్పు రిజర్వ్‌

Andhra Pradesh High Court
Andhra Pradesh High Court

అమరావతి: ఏపిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి జీవో జారీ చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన పేదలకు సీఆర్డీఏ చట్టం ప్రకారం ఆ ప్రాంతంలో రిజర్వ్ చేసిన ఐదు శాతం భూముల్లోనే ఇళ్లు నిర్మించాలని అన్నారు. పేదలకు నివాస స్థలాలు కేటాయించాలని చట్టంలో ఎక్కడా లేదని, కేవలం, నివాసయోగ్యమైన ఇల్లు మాత్రమే ఇవ్వాలని ఉందని న్యాయస్థానం ఎదుట తమ వాదనలు వినిపించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/