ఇకపై వర్చువల్ విధానం ద్వారానే కేసుల విచారణ

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

అమరావతి : కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో సైతం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేసులను వర్చువల్ విధానంలోనే విచారించబోతున్నట్టు స్పష్టం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 17 నుంచి వర్చువల్ విధానంలోనే కేసుల విచారణను చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో అన్ని కోర్టుల్లో విచారణ ప్రత్యక్షంగా కాకుండా, వర్చువల్ గా జరగనుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/