టీటీడీ బోర్డులో నేర చరితులను నియమించడం పట్ల హైకోర్టు ఆగ్రహం

నియమించినవారికి నోటీసులివ్వండి

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో నేర చరితులను నియమించడం పట్ల ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ హైకోర్టు విచారించింది. నేరచరిత్ర ఉన్న వారిని నియమించిన వారికి నోటీసులివ్వాలని, దానిపై వివరణ తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోకు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా దీనిపై రిపోర్టు ఇవ్వాలని సర్కారుకు స్పష్టం చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/