ఏపిలో మద్యం ప్రియులకు ఊరట

ఇతర రాష్ట్రాల నుండి 3 మద్యం సీసాలు తీసుకురావచ్చు..హైకోర్టు

ap high court
ap high court

అమరావతి: ఏపి హైకోర్టు మద్యం ప్రియులకు శుభవార్త చెప్పింది. గతంలో మాదిరే ఇతర రాష్ట్రాల నుంచి ఏపికి 3 మద్యం సీసాలను తీసుకురావొచ్చని స్పష్టం చేసింది. ఏపిలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురానివ్వక పోవడంపై దాఖలైన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. పోలీసులు, ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు మద్యం సీజ్‌ చేస్తున్నారని పిటిషనర్లు వాపోయారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం.. ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం సీసాలు తీసుకురావచ్చని తీర్పునిచ్చింది. జీవో 411 అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. కోర్టు తీర్పుతో మద్యం ప్రియులకు ఏపిలో ఉన్న పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగినట్లు అయింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/