ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఏపీ హైకోర్టు నోటీసులు

వంశీ గ‌నుల అక్ర‌మ త‌వ్వ‌కాల‌కు పాల్పడుతున్నారంటూ దాఖ‌లైన పిటిష‌న్‌

vallabhaneni vamsi
vallabhaneni vamsi

అమరావతిః ఏపీ హైకోర్టు గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్‌కు నోటీసులు జారీ చేసింది. వ‌ల్ల‌భ‌నేని వంశీ గ‌నుల అక్ర‌మ తవ్వ‌కాల‌కు పాల్ప‌డుతున్నారంటూ దాఖ‌లైన ఓ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీకరించిన హైకోర్టు… ఈ పిటిష‌న్ ఆధారంగానే వంశీకి నోటీసులు జారీ చేసింది. వంశీతో పాటు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, గ‌నుల శాఖ అధికారుల‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను హైకోర్టు 8 వారాల‌కు వాయిదా వేసింది.

2014 ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్థిగా గ‌న్న‌వ‌రం నుంచి పోటీ చేసి విజయం సాధించిన వంశీ…2019 ఎన్నిక‌ల్లోనూ అదే పార్టీ త‌ర‌ఫున గ‌న్న‌వ‌రం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో వైఎస్‌ఆర్‌సిపి అధికారం చేప‌ట్ట‌డంతో మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో టిడిపికి దూరంగా జ‌రిగిన వంశీ వైఎస్‌ఆర్‌సిపికి ద‌గ్గ‌ర‌య్యారు. అయితే ఇప్ప‌టికీ టిడిపికి రాజీనామా చేయ‌ని వంశీ… రికార్డుల ప్ర‌కారం టిడిపి ఎమ్మెల్యేగానే కొన‌సాగుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/international-news/