జీవో నెం.2 సస్పెండ్ చేసిన ధర్మాసనం

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. జీవో నెంబర్‌ 2ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్‌వోలకు అప్పగిస్తూ జారీచేసిన జీవో నెం 2ను రద్దు చేసింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.జీవోను సవాల్‌ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ సవాల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్‌ తరపున వాదనలను న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వినిపించారు. పంచాయతీ సర్పంచ్‌ అధికారాలు వీఆర్‌వోలకు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకూ సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను.. వీఆర్‌వోలకు అప్పగించడమేంటని ఏపీ హైకోర్టు నిలదీసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/