టిడిపి నేత నాదెండ్ల బ్రహ్మంకు బెయిల్ మంజూరు

కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు

tdp
tdp

అమరావతి: ఏపి హైకోర్టు టిడిపి నేత నాదెండ్ల బ్రహ్మంకు బెయిల్ మంజూరు చేసింది. నాలుగు రోజుల క్రితం గుడివాడ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈకేసు నమోదైంది. దీంతో బెయిల్ కోసం హైకోర్టును బ్రహ్మం ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పోలీసులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. నాదెండ్ల బ్రహ్మంను అరెస్ట్ చేయకుండా, విచారించాలని ఆదేశించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/