రేపు ఏపి గ్రూపు-2 స్క్రీనింగ్‌ పరీక్ష

AP Govt LOGO
AP Govt LOGO

అమరావతి: ఏపి గ్రూప్‌-2 స్క్రీనింగ్‌  పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిట్లు ఏపి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. కార్యదర్శి ఎ.కె మౌర్య  ఈరోజు ఈ మేరకు ఓ ప్రకటన జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 727 కేంద్రాల్లో ఆదివారం ఈ పరీక్ష జరగనుంది. 2,95,036 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కేటాయించిన పరీక్ష కేంద్రం వివరాలను అభ్యర్థుల చరవాణులకు సంక్షిప్త సమాచారం ద్వారా తెలియజేశాం. కేంద్రాలను అభ్యర్థులు ఒక రోజు ముందుగానే చూసుకోవడం మంచిది. రివైజ్డ్‌ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచాం. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల ఫోన్‌ నంబర్లు కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను ఉదయం 9.00 నుంచి 9.45 గంటల మధ్య మాత్రమే అనుమతిస్తాంగగ అని వెల్లడించారు.


మరిన్ని తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/