మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఇటీవల వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఏపీ వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో నంబర్ 59ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వారిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది ఏపీ హైకోర్టుకు తెలిపారు.

జీవో-59పై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయవాది హైకోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. డ్రెస్‌కోడ్‌ సైతం ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని చెప్పారు. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/