ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబు..వరుస పెట్టి ప్రభుత్వ అధికారులను బదిలీ చేస్తున్నారు. నిన్న ఐఏఎస్ లను బదిలీ చేయగా..ఈరోజు కొందరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసారు. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించారు. అతుల్ సింగ్ కు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. శంకబ్రత బాగ్చీకి అగ్నిమాపక శాఖ డీజీగా అదనపు బాధ్యతలు కేటాయించారు.

గతంలో చిత్తూరు ఎస్పీగా వ్యవహరించిన రిశాంత్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ప్రసుత్తం రిశాంత్ రెడ్డి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగానూ, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ లోనూ ఉన్నారు. తాజా బదిలీల నేపథ్యంలో, రిశాంత్ రెడ్డిని ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.