సినీ లవర్స్ కు గుడ్ న్యూస్ తెలిపిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

సినీ లవర్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రేక్షకులకు తక్కువ ధరలకే సినిమా టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం తో యువర్ స్క్రీన్స్ పేరిట ప్రత్యేక పోర్టల్ ను తీసుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రేక్షకులకు ఇకపై తక్కువ ధరకే ఆ​న్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు లభించనున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఆన్‌లైన్‌ టికెట్‌ లభ్యం కానుంది.

ఏపీఎఫ్‌డీసీ పోర్టల్‌ యువర్‌ స్క్రీన్స్‌ ద్వారా బ్లాక్‌ టికెటింగ్‌ విధానానికి స్వస్థి పలకనున్నారు. యువర్‌ స్క్రీన్స్‌లో టికెట్‌ బుక్‌ చేసుకుంటే అదనపు ఛార్జీల భారముండదు. అయితే ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్‌ విధానం వల్ల థియేటర్స్‌కి ఉన్న గత ఒప్పందాలు రద్దు కావు అని ఏపీ ఎఫ్‌డీసీ ఎండీ విజయ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.