ఏబీ వెంకటేశ్వరరావు కేసు..సుప్రీంలో ఏపి ప్రభుత్వం పటిషన్

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఏపి సర్కారు పిటిషన్

supreme court
supreme court

న్యూఢిల్లీ: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై ఏపి ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జూలై 6 తర్వాత విచారణ జరగవచ్చని తెలుస్తోంది. కాగా, ఏబీ వెంకటేశ్వరావు ఇప్పటికే సుప్రీంలో కేవియట్ దాఖలు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ అక్రమాలకు పాల్పడ్డారని, నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై  వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తప్పించింది. దాంతో ఏబీ తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించినా, అక్కడ ఆయనకు చుక్కెదురైంది. క్యాట్ కూడా ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఏబీ దాఖలు చేసిన దరఖాస్తును తోసిపుచ్చింది.

దాంతో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు ఏపి సర్కారు విధించిన సస్పెన్షన్ చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా, ఆయనకు వెంటనే బాధ్యతలు అప్పగించాలని, సస్పెన్షన్ కాలానికి సంబంధించిన వేతన బకాయిలను కూడా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు నేపథ్యంలోనే ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/