ఏపి స్థానిక ఎన్నికలు…సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్‌

రేపటి లిస్టులో చేర్చాలని ఆదేశించిన న్యాయమూర్తి

supreme court
supreme court

అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకే వాయిదా వేస్తున్నట్లు చేసిన ప్రకటనను ఆక్షేపిస్తూ ఈరోజు పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత్‌ రేపటి రెగ్యులర్‌ లిస్టులో ఈ కేసును ఉంచాలని ఆదేశించారు. మరోవైపు ఏపీ హైకోర్టులో తాండవ యోగేష్‌, జనార్దన్‌ అనే ఇద్దరు వ్యక్తులు లంచ్‌మోషన్‌లో ప్రైవేటు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం అనుమతించడంతో మధ్యాహ్నం విచారణకు రానుంది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/