మద్యం నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టిన బుగ్గన

Buggana RajendranathReddy
Buggana Rajendranath Reddy

అమరావతి:ఏపి ప్రభుత్వం శాసనసభలో విదేశి మద్యం నియంత్రణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె.నారాయణ స్వామి శాసన మండలిలో ఉండటంతో ఆయనకు బదులుగా ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మద్యం దుకాణ లైసెన్సులు, మద్యం నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా చట్ట సవరణకు అవసరమైన ముసాయిదా బిల్లును కూడా శాసనసభ ముందుంచింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/