సీటీ స్కాన్‌ ధర రూ.3 వేలు: ఏపీ సర్కార్ నిర్ణయం

ఆసుపత్రులకు, ల్యాబ్ లకు ప్రత్యేక ఆదేశాలు జారీ

ap govt decision -CT scan cost Rs 3,000
CT scan

Amaravati: రాష్ట్రంలో కరోనా కేసుల దృష్ట్యా సీటీ స్కాన్‌పై ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సీటీ స్కాన్‌ ధర రూ.3 వేలుగా నిర్ణయించింది. అధిక ధర వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. సీటీ స్కాన్‌ చేసిన తరువాత ఆయా ఆసుపత్రులలో పాజిటివ్ వచ్చిన వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించింది.
మరోవైపు ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకూ 1.01 లక్షల మంది కోవిడ్‌ రోగులకు వివిధ ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స అందించారు.. ఇందుకోసం రూ.309.61 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ నెల 23 వరకు మొత్తం 1,01,387 మంది కరోనా బాధితులకు ఉచిత వైద్యం ప్రభుత్వం అందించింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/