అక్టోబర్ 18 వరకు ‘వైఎస్సార్‌ ఆసరా’ ఉత్సవాలు – జగన్

వైఎస్సార్ ఆసరా రెండో విడత నిధులను విడుదల చేసారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైయ‌స్సార్‌ ఆసరా సభా వేదికఫై జగన్ ఈ నిధులను విడుదల చేసారు.

ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ..రెండో విడత కింద రూ.6,439.52 కోట్లు జమ చేస్తున్నాం. నాలుగు విడతల్లో రూ.25,517 కోట్లు జమ చేస్తాం. కోడ్‌ దృష్ట్యా వైఎస్సార్‌ జిల్లాలో నవంబర్‌ 6 నుంచి 15 వరకు ఆసరా పథకం అమలు చేస్తామన్నారు. దేవి నవరాత్రుల్లో ప్రారంభించడం శుభపరిణామం అన్నారు. రుణ మాఫీ చేస్తామన్న చంద్రబాబు.. డ్వాక్రా మహిళలను మోసం చేశారు. చంద్రబాబు మాట నమ్మి డ్వాక్రా మహిళలు అప్పుల్లో కూరుకుపోయారని సీఎం అన్నారు. నేటి నుంచి ఈ నెల 18 వరకు ‘వైఎస్సార్‌ ఆసరా’ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

‘వైయ‌స్సార్‌ ఆసరా’ను ప్రారంభించేందుకు ఒంగోలు న‌గ‌రానికి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.