అమూల్‌తో ఏపి ప్రభుత్వం అవగాహన ఒప్పందం
మహిళా పాడిరైతులు ఆర్థికంగా ఎదుగుతారన్నసిఎం

అమరావతి: ఏపి ప్రభుత్వం అమూల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సిఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్‌హెడ్ రాజన్ సంతకాలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేనేజింగ్ డైరెక్టర్‌తో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఈ ఒప్పందం ఓ గొప్ప అడుగు అని సిఎం జగన్ పేర్కొన్నారు. మహిళా పాడిరైతులు ఆర్థికంగా, తద్వారా సామాజికంగా ఎదగడానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుందని తెలిపారు. ఇకపై ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నామని, డెయిరీ రంగంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏపి ముఖద్వారంలా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా ఈ ఒప్పందంతో ఏపి పాడిరైతులకు మెరుగైన ధర దక్కడమే కాకుండా, వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలోని సహకార సంఘాల డెయిరీలకు ప్రపంచస్థాయి డెయిరీ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చే వీలుంది. విస్తారమైన మార్కెటింగ్ అవకాశాలు ఏర్పడతాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/