మరోసారి ఏపిలో వలంటీర్ల భర్తీ

భర్తీకి సర్కారు అనుమతి కోరిన పురపాలక శాఖ

cm jagan
cm jagan

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకాల్లో వలంటీర్ల వ్యవస్థ ఒకటి. ప్రజల వద్దకే పథకాలు అనే ఆలోచనతో జగన్ గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థకు బీజం వేశారు. ఇప్పటికే ఓసారి వలంటీర్ల నియామకం జరిగినా, వివిధ కారణాల రీత్యా కొందరు తప్పుకున్నారు. ఇప్పుడా ఖాళీలను భర్తీ చేసేందుకు మరోసారి నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి పురపాలక శాఖకు అనుమతి లభించింది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రంలో మొత్తం వలంటీర్ల సంఖ్య 70,888 కాగా, ప్రస్తుతం విధుల్లో ఉన్నవాళ్ల సంఖ్య 51,718. ఈ నేపథ్యంలో, ఖాళీగా ఉన్న 19,170 వలంటీర్ పోస్టుల కోసం మరికొన్ని రోజుల్లో ప్రకటన రానుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/