కరెంట్ కోతలపై రాష్ట్ర ప్రజలకు తీపి కబురు తెలిపిన ఏపీ సర్కార్

కరెంట్ కోతలపై రాష్ట్ర ప్రజలకు తీపి కబురు తెలిపిన ఏపీ సర్కార్. రాష్ట్రంలో కొన్ని నెలలుగా విద్యుత్ కోతలు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఒక వైపు ఎండలు దంచికొడుతుంటే.. మరో వైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోయారు. కరెంట్ కోతల విషయంలో ప్రభుత్వం ఫై విమర్శలు కురిపించారు. కాగా ఇక నుండి రాష్ట్రంలో రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని ప్రభుత్వం తెలిపింది.

మే 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరణ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కొరత వలన కొద్దిరోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ పంపిణీ లో సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడటంతో అన్ని రంగాల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి నీటి రాక పెరగడంతో విద్యుత్ సమస్య తీరనున్నట్లు సమాచారం.