పీవీ సింధు కు న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం

అమరావతి : ఒలింపిక్స్‌లో రెండో మెడ‌ల్ గెలిచిన సింధు కు ఏపీ ప్ర‌భుత్వం రూ.30 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించింది. సింధు టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన విష‌యం తెలిసిందే. దీంతో రాష్ట్ర క్రీడా విధానంలో భాగంగా సింధుకు ఆ న‌గ‌దు బ‌హుమ‌తి ఇవ్వాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. ఏపీ క్రీడా విధానం ప్ర‌కారం గోల్డ్ మెడ‌ల్ విజేత‌ల‌కు రూ.75 ల‌క్ష‌లు, సిల్వ‌ర్ గెలిస్తే రూ.50 ల‌క్ష‌లు, బ్రాంజ్ గెలిస్తే రూ.30 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్నారు.

కాగా, ఇంత‌కుముందే సింధుతోపాటు మ‌రో బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ సాత్విక్‌సాయిరాజ్‌, హాకీ ప్లేయ‌ర్ ర‌జ‌నిల‌కు టోక్యో వెళ్లే ముందు రూ.5 ల‌క్ష‌లు ఇచ్చారు సీఎం జ‌గ‌న్‌. ఆ స‌మ‌యంలోనే విశాఖ‌ప‌ట్నంలో బ్యాడ్మింట‌న్ అకాడ‌మీ ఏర్పాటు చేయ‌డానికి సింధుకు 2 ఎక‌రాల స్థ‌లం కేటాయించిన‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/