కొత్త టికెట్ ధరలు ప్రకటించిన ఏపీ సర్కార్..ఇక థియేటర్స్ ను ఫంక్షన్ హాల్స్ చేసుకోవాల్సిందే

ఆంధ్రప్రదేశ్ సర్కార్.. రాష్ట్రంలో కొత్త టికెట్ ధరలు ప్రకటించింది. ఈ టికెట్ ధరలు చూస్తే సినిమా థియేటర్స్ ఇక ఫంక్షన్ హాల్స్ చేసుకోవడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా సినిమా టికెట్ల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం.. బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు ప్రాంతాల వారీగా సినిమా టికెట్ల ధరను నిర్ణయించింది. ఈ మేరకు ధరలను విడుదల చేసింది. కొత్త ధరల ప్రకారం టికెట్ ధర రూ.5 నుంచి రూ.250 వరకు నిర్ణయించింది.

మల్టీప్లెక్సు: ప్రీమియం రూ.250, డీలక్స్: రూ.150, ఎకానమీ: రూ.75
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20

మున్సిపాలిటీలు:

మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ: ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15

నగర పంచాయతీలు:

మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ: ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10

గ్రామ పంచాయతీలు:

మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ: ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5

ఏపీ ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్లును ఆమోదించిన దరిమిలా సినిమా టికెట్ల కొత్త రేట్లను బుధవారం ప్రకటించింది. ఏపీలో సినిమా టికెట్ ధర.. కప్పు ‘టీ’ ధర కంటే తక్కువ ఉండటం గమనార్హం.