పీఆర్సీ ప్రకారమే విద్యుత్ ఉద్యోగులకు జీతాలు
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

Amaravati: డిస్కమ్‌లను ప్రైవేటీకరించే ఆలోచన తమకు లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ‘కోవిడ్‌తో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులకు 75శాతం వాక్సినేషన్ ఇప్పించటం జరిగిందన్నారు .విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇస్తున్నామని తెలిపారు. ‘‘గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని 80వేల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిందని అన్నారు. విద్యుత్ రంగాన్ని కాపాడేందుకు సీఎం జగన్ 18వేల కోట్లు కేటాయించారని తెలిపారు .
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/