నేటి నుండి ఏపి ఎంసెట్‌ హాల్‌ టికెట్లు

AP Eamcet Hall Ticket 2019
AP Eamcet Hall Ticket 2019


అమరావతి: ఈరోజు నుండి ఏపి ఎంసెట్‌ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సెట్‌ కన్వీనర్‌ సాయిబాబా తెలిపారు. హాల్‌ టికెట్ల వెనుక భాగంలో పరీక్షకేంద్రం రూట్‌మ్యాప్‌ ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. తెలంగాణలో పరీక్ష రాసే వారికి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌, నాచారం, సికింద్రాబాద్‌లలో కేంద్రాలను కేటాయించారు.ఓట్ల లెక్కింపు కేంద్రాలను పలు జిల్లాల్లో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసినందున దాదాపు 10 వేల మంది విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న 3 పరీక్షాకేంద్రాలు కాకుండా దగ్గరలోని మరో కేంద్రాన్ని కేటాయించామని తెలిపారు. ఈ విధంగా కేంద్రాలు మార్చిన విద్యార్థులకు మధ్యాహ్న సెషన్‌లో పరీక్ష రాసే అవకాశం కల్పించామని వివరించారు.


•ఇంజినీరింగ్‌ పరీక్ష ఈ నెల 20, 21, 22 తేదీల్లో 2 విడతలు, 23న ఉదయం ఒక విడత నిర్వహిస్తార •వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షలు 23 మధ్యాహ్నం, 24న 2 విడతలుగా నిర్వహిస్తారు.


మరిన్ని తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/