ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

AP EAMCET counselling
AP EAMCET counselling

అమరావతి: ఏపిలో ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. రేపటి నుండి విద్యార్థులు కళాశాలలకు ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది 1 నుంచి 35వేల ర్యాంకు వరకు ఈనెల 27, 28న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 35,001 నుంచి 80 వేల వరకు ఈ నెల 29, 30న.. 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు జులై 31, ఆగస్ట్‌ 1న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆగస్ట్‌ 2న వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు వీలు కల్పించింది. అనంతరం ఆగస్ట్‌ 4న సీట్లు కేటాయించనున్నారు. ఆగస్ట్‌ 5 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి.అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో గతేడాది ఫీజులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా, జగన్ పాతయాత్ర హామీ మేరకు విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించనుంది. గతేడాది వరకూ రూ.35వేల ఫీజు మాత్రమే ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇచ్చింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/