చారిత్రక జిల్లాల పేరు మార్పు అవసరమా?

పలుచోట్ల ప్రజల వ్యతిరేకత

Andhra pradesh districts
Andhra pradesh districts

ఈమధ్య సోషల్‌ మీడియాలో, పత్రికలలో ఆంధ్రప్రదేశ్‌ 13 జిల్లాల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొస్తున్న విషయం విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా గతంలో ఈ 13జిల్లాల ను విస్తరిస్తూ సంఖ్యనుపెంచే ఆలోచన చేసిందికాని కార్య రూపం దాల్చలేకపోయింది.

ఇప్పుడు మళ్లీ ఈ విషయంపై చర్చ ఈ విధంగా జరుగుతోంది. మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ త్వరితంగా 10జిల్లాలను 33 జిల్లాలుగా పరిపాలన సౌలభ్యం కోసమని పెంచుకున్నది.

అయితే ఈ 33 జిల్లాల పేర్లు వరుసగా చెప్పమంటే ఇప్పటికిప్పుడు ఏ విద్యార్థీ అప్పచెప్పలేని పరిస్థితి.

ఇప్పటివరకున్న 10 జిల్లాల కున్న కలెక్టర్లు,ఆర్డీఓలు,ఎమ్మార్వోలు,ఐ.ఎ.ఎస్‌ అధికారులు, పలు ఉద్యోగుల సంఖ్య పెరగడం తప్పించి పరిపాలనలో ప్రయోజనం ఏవిధంగా సాగుతుందో ప్రజలకంటే పాలకులకే ఎక్కువగా తెలిసుంటుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌ కూడా ఇదే విధానాన్ని అవలంభించే పరిస్థితి నెలకొంటే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు జిల్లా పేర్ల విషయంలో అనుసరిస్తున్న విధానంపై పలువ్ఞరి ప్రజల నుండి మేధా వ్ఞల వరకు తీవ్రవ్యతిరేకత కనిపిస్తోంది.

ఉదాహరణకి ఇప్పటివరకు కృష్ణాజిల్లాలో ఉన్న విజయవాడ ఈ ఉహాగానాల మేరకు ఇకముందు ‘విజయవాడ జిల్లాగా ఆవిర్భవించనున్నదని తెలుస్తోంది.

అలాగే కృష్ణాజిల్లాకు కేంద్రంగాఉన్న బందరు ఇకమీదట ‘మచిలీపట్నంజిల్లాగా రెండుగా విడగొట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తోంది.

కాని 160ఏళ్ల చరిత్రగల కృష్ణాజిల్లా పేరును పూర్తిగా తుడిచిపెట్టి కొత్త పేర్లుగా ఆయా నగరాల పేర్లను ఎన్నిక చేయడాన్ని ఎక్కువసంఖ్యలో ప్రజలు, మేధావులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు

.విజయవాడ నగరాన్ని తాకుతూ పారే కృష్ణానది తరతరాలుగా ఈ ప్రాంతవాసుల దాహాన్ని, ఆహారాన్ని అందిస్తూ ఇక్కడి ప్రజల జీవనాడిగా పాతుకు పోయి నరనరాలలో మమేకమైపోయింది.

ఆంధ్రప్రదేశ్‌ పురాతన బ్రిటిష్‌ పాలితప్రాంతాల్లో ఒకటిగాఉన్న నాటి కృష్ణా జిల్లా, ఇది ముందుగా ‘మసులపట్నంజిల్లాగా, మచిలీపట్నం జిల్లాగా పిలవబడింది.

1859లో అప్పటి గుంటూరు జిల్లా రద్దు చేయబడినప్పుడు దాని జిల్లాకు కొన్ని తాలూకాలు చేర్చబడి ఈ ప్రాంతంలో కృష్ణానది ఉండటం వల్ల ‘కృషా ్ణజిల్లాగా పేరు మార్చబడింది. (ఆతర్వాత 1925లో కృష్ణా జిల్లాను కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలుగా విభజించారు)

అటువంటి 160ఏళ్ల చరిత్రగల కృష్ణాజిల్లా పేరు ఈ చర్య వల్లపూర్తిగా తుడిచిపెట్టుకుపోయి చరిత్రలోలేకుండా చేయడ మే అవుతుందని ఈ ప్రాంతవాసులు విమర్శిస్తున్నారు.

విజ యవాడనగరాన్ని స్పృశిస్తూ ప్రవహిస్తున్న కృష్ణానది హంసల దీవిదగ్గర సముద్రుడిలోకలిసే అపురూపమైన వరాన్ని, గొప్ప తనాన్ని చాటుకుంటున్న వైనం.

ఈ పేరు మార్పువల్ల తన ఉనికి కోల్పోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

ఒకవేళ ఈ జిల్లాను రెండుగా చేసే పరిస్థితి ఉంటే విజయవాడకు కృష్ణాజిల్లా పేరునేఉంచి,మరో కొత్తజిల్లాకు మరోకొత్తపేరును ఎన్నిక చేయవచ్చని కూడా సూచిస్తున్నారు.

అదీకాక ఇప్పు డున్న అధికార పార్టీ నాయకుడు గత ఎన్నికల సమయంలో కృష్ణాజిల్లా పేరును ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్‌ పేరును పెడతామని మాట ఇచ్చి ఉన్నారు.

కనుక ఈ జిల్లా నుండి ఎన్నిక చేయనున్న మరో కొత్తజిల్లా పేరును ఎన్టీఆర్‌ జిల్లాగా నామకరణం చేస్తే మాట దక్కించుకున్నవారవ్ఞతారన్నది మరొక సూచనగా వినవస్తోంది.

అలాగే గోదావరి జిల్లాప్రజలు కూడా తమ జిల్లా పేర్లను పూర్తిగా తొలగించి కొత్తజిల్లా పేర్లను ప్రతిపాదించడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు.

ఈ రకంగా జిల్లా పేర్లసంఖ్యను పెంచడం ప్రార భించకముందే స్థానికప్రజల వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలి.

  • చలపాక ప్రకాశ్‌