అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన పలువురు భక్తుల ఆచూకీ తెలియడం లేదు

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన పలువురు భక్తుల ఆచూకీ ఇంకా తెలియాకపోవడం తో ఆయా కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతుంది. గల్లంతైన వారిలో ఐదుగురు యాత్రికులు, అందులో ఒకరు క్షేమంగా ఉన్నట్లు ఏపీభవన్‌ అధికారులు వెల్లడించారు. విజయవాడ కు చెందిన వినోద్ అశోక్ , రాజమహేంద్రవరం కు చెందిన గునిశెట్టి సుధ, తిరుపతి కి చెందిన మధు , గుంటూరు కు చెందిన ఝాన్సీలక్ష్మి , విజయనగరం వాసి నాగేంద్రకుమార్‌ గల్లంతవ్వగా వీరిలో నాగేంద్రకుమార్‌ క్షేమంగా ఉన్నారు.

విజయనగరంలోని తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడిన వానపల్లి నాగేంద్రకుమార్.. క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
గల్లంతైన వారి కోసం ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తోందని ఏపీ అధికారులు తెలిపారు. మిస్సింగ్ అయినవారి ఆధార్ నంబర్లు అడిగి తీసుకున్నారు. శ్రీనగర్‌లోని టెంపుల్ బోర్డ్, కమాండ్ కంట్రోల్ రూంతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కేంద్రంతో సమన్వయం చేస్తున్న ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ లభించిన మృతదేహాల్లో ఏపీకి చెందిన వారెవరూ లేరని అధికారులు స్పష్టం చేశారు. యాత్రికుల మొబైల్ నంబర్స్ పనిచేయకపోవడం, స్విచ్ ఆఫ్ కావడం వల్ల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.