బుల్లెట్ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం భార్య డ్యాన్స్

బుల్లెట్ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం భార్య డ్యాన్స్

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సతీమణి బుల్లెట్ బండి పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసి వార్తల్లో నిలిచింది. ‘బుల్లెట్ బండి’ ఇప్పుడు ఈ పాట ఎక్కడ చూసిన మారుమోగిపోతుంది. సామాన్య ప్రజలే కాదు సినీ , రాజకీయ ప్రముఖులు కూడా ఈ పాటను పాడుతూ..వేడుకల్లో అదిరిపోయే స్టెప్స్ వేస్తున్నారు.

ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు స్టెప్స్ వేయగా..తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సతీమణి డ్యాన్స్ చేశారు. మంత్రి నారాయణ స్వామి 42వ వివాహ వార్షికోత్సవం నిర్వహించారు. తిరుపతిలోని తన నివాసంలో కుటుంసభ్యుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా…బుల్లెట్ బండి పాట వినిపించారు. మంత్రి సతీమణి సరదాగా డ్యాన్స్ చేశారు. భర్త ఎదుట డ్యాన్స్ చేసిన వీడియో అందర్నీ ఆకట్టుకొంటోంది.