జగన్‌ పాటకు పుష్ప శ్రీవాణి టిక్‌ టాక్‌

జగన్ పై తన అభిమానాన్ని చాటుతూ వీడియో


AP Deputy CM Pamula Pushpa Srivani Tiktok video

అమరావతి: ఏపి ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి సిఎం జగన్‌పై తన అభిమానాన్ని చాటుతూ ఓ టిక్ టాక్ వీడియో చేశారు. ‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న’ అనే పాటకు హావభావాలు పలికిస్తూ ఆమె చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. గతంలో జగన్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఈ పాట బాగా వినపడింది. ఆ పాటను తీసుకునే పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియోను చేశారు. ఈ వీడియో 16 సెకన్ల నిడివి ఉంది. ప్రస్తుతం టిక్ టాక్ యాప్ యువతను ఎంతగా ఆకర్షిస్తోందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ను చక్కగా వినియోగించుకుని పుష్ప శ్రీవాణి జగన్ మీద చూపిన అభిమానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/