ఏపి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ

ఇన్ఛార్జి సీఎస్ గా నీరబ్ కుమార్

LV-Subrahmanyam
LV-Subrahmanyam

అమరావతి: ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ ఉత్తర్వులు కూడా వెంటనే అమల్లోకి వస్తున్నట్లు జీవో వచ్చింది. సుబ్రహ్మణ్యంను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించారు. సీఎస్‌గా ఉన్న ఎల్వీ తన బాధ్యతలను తక్షణమే సీసీఎల్‌కే అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. ఇంఛార్జ్ సీఎస్‌గా నీరబ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. సీఎంవోలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చినందుకు ఎల్వీపై బదిలీ వేటు పడినట్లు చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. షోకాజ్ నోటీసులు అందుకున్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేయడం. అంతేకాదు.. ఎల్వీ సుబ్రహ్మణ్యంక మరో ఐదునెలల సర్వీసు ఉండగానే బదిలీ చేయడం గమనార్హం.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/