ఏపీలో 405 కేసులు – గుంటూరులో తీవ్ర ఆందోళన

ఒక్క రోజులోనే 17 కేసులు నమోదు

corona updates-AP

Amaravati: రాష్ట్రంలో కరోనా విస్తృతి అంతకంతకూ పెరుగుతూ ఉంది. తాజాగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 405కు చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 17కేసులు నిర్థారణ కాగా.. కర్నూలు జిల్లాలో 5 కేసులు, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక చొప్పున రిపోర్టు అయ్యాయి.

మరోవైపు గుంటూరు, కర్నూలులో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 82 కేసులు నమోదుకాగా, గుంటూరు జిల్లాలో 75 పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో యంత్రాంగం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

11మంది డిశ్ఛార్జి

రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 మంది కరోనా బాధితులు కోలుకోగా వారిని హాస్పటల్‌నుంచి డిశ్ఛార్జి చేశారు.

విశాఖ నుంచి 4గురు బాధితులు డిశ్ఛార్జి కాగా.. కృష్ణా నుంచి ముగ్గురు, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, ప్రకాశం జిల్లా నుంచి ఒక్కరు చొప్పున పేషెంట్లు డిశ్ఛార్చి అయ్యారు.

అలాగే ఇప్పటి వరకు ఆరుగురు కరోనా బాధితులు మరణించారు. దీంతో ప్రస్తుతం 388 మంది కరోనాతో పోరాడుతూ, హాస్పటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు ఇప్పటి వరకు 6,958 నమూనాలను పరీక్షించగా.. 6,577 నమూనాలకు నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఇంకా 365 నమూనాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడికావల్సి ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/