చంద్రబాబు సింగపూర్ పర్యటన

AP CM BABU

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటనకు బయల్దేరారు. సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. హైదరాబాద్ మీదుగా చంద్రబాబు సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్ లో జరిగే మింట్ ఆసియా లీడర్ షిప్ సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. సదస్సులో భాగంగా వివిధ సంస్థల సీఈవోలతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించనున్నారు.