రాష్ట్రంపై బిజెపి ప్రభుత్వం పగబట్టింది : చంద్రబాబు

AP CM BABU
AP CM BABU

రాష్ట్రంపై బిజెపి ప్రభుత్వం పగబట్టింది : చంద్రబాబు

అమరావతిµ : ఏపి ప్రభుత్వంపై బిజేపి ప్రభుత్వం పగబట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పలు కార్యాక్రమాల్లో పాల్గొని ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.ప్రధాని మోదీ 2014ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభల్లో పలుసమావేశాల్లో అనంతరం గద్దెనెక్కిన తర్వాత ఏపికి ఇచ్చిన విభజన చట్టం హామీలను కాని,ఏపికి ప్రత్యేకహోదాకాని అమలు చేయకుండా ఏపిపై పగబట్టారని ఆయన ఆరోపించారు.రాజ్యాంగాన్ని కూడా కేంద్రప్రభుత్వం గౌరవించడం లేదని,కనీసం చట్టంలో పొందుపరిచిన వాటిని కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు.హామీలు అమలు చేయాలని అడిగితే అణగదొక్కడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.తిరుపతి,నెల్లూరు,అమరావతి సభల్లో ప్రత్యేకహోదా,విభజన హామీలపై మోదీ వాగ్ధానం చేశారని నమ్మించి మోసం చేశారని తీవ్రస్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు.రాజధానికి మట్టి,నీళ్ళు తీసుకొచ్చి వాటిని ఏపి ప్రజలకు బహుమతిగా ఇచ్చారని ఇంతవరకు హామీ ఇచ్చి నిలబెట్టుకోక దిగజారే పరిస్థితికి వచ్చారని సీఎం బాబు ధ్వజమెత్తారు.

మోదీ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో నాటకాలు ఆడుతున్నారని,హోదా ఎవరికి ఇవ్వమని చెప్పి తర్వాత 11రాష్ట్రాలకు ప్రకటించారని బాబు గుర్తుచేశారు.విభజన తర్వాత బిజేపి నాయకులు ఏపిపై ప్రేమ వలగబోసారని ఎన్డీఎతో టిడిపి పొత్తు ఉన్నంతవరకు ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన హామీలన్ని అమలుచేస్తామని చెబుతూనే నాలుగేళ్ళు కాలం గడిపి తాము పొత్తు వైదొలగిన అనంతరమే బిజేపి ప్లేటు ఫిరాయించి తమను టార్గెట్‌గా చేసుకొని విమర్శించడం దారుణమన్నారు. ఏపిపై బిజేపి ప్రభుత్వం కక్షగట్టి తమపై దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.లోపభూయిష్టంగా లెక్కలు కట్టి రాష్ట్రానికి ఇవ్వాల్సిన మొత్తం నిధులను విడుదల చేయకుండా కేవలం కాకిలెక్కలు చెబుతూ బిజేపి రాజకీయం చేయాలని ప్రయత్నంచేస్తే ప్రజలు ఊరుకోరని బాబు ఆరోపించారు.ప్రధాని మోదీకి గుజరాత్‌ను మించిపోతామనే భయం పట్టుకుని ఏపిని అన్ని రంగాల్లో అడ్డుకునే ప్రయత్నం చేసినా తాము అధిగమిస్తున్నామని ఆయన గుర్తుచేశారు.పటేల్‌ శివాజీ విగ్రహాలు,డొలేరా నగరం కుంభమేళాకు కోట్లాది నిధులు ఇచ్చారు.ద్వారకాలో కన్వెన్షన్‌ సెంటర్‌కు రూ.27వేల కోట్లు ఇచ్చి కొత్త రాష్రమైన ఏపికి నిదులపై మోదీనోట మాట ఏమైందని బాబు ప్రశ్నించారు.ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా పెట్టుబడి పెట్టడానికి కేంద్రం చొరవతీసుకోకుండా ఏపిపై అడుగడుగునా నిర్ణక్ష్యదోరణి ప్రదర్శిస్తూ రాజకీయ కోణంలోనే యోచిస్తున్నారని బాబు ఆరోపించారు.అలాగే తెలంగాణాకు రూ.450కోట్లు ఇచ్చి ఏపికి ఇవ్వకుండా కక్షసాధింపుచేస్తున్నారు.ఏదో విధంగా రాష్ట్రాన్ని అణగదొక్కాలని కేంద్రం కుట్ర చేస్తూ ఏపిలో బిజేపి మనుగడకోసం ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు తగిన బుద్దిచెబుతారని ఆయన గుర్తుచేశారు.అలాగే అమరావతి,పోలవరం ప్రాజెక్టుల నిర్మాణపనులు పనులు ముందుకు సాగకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరెండు ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేస్తే తెలుగుదేశం పార్టీకి మంచిపేరు వస్తుందని ప్రస్తుతం ప్రజలో బిజేపికి ఉన్న వ్యతిరేకత మరింత పెరుగుతుందని ఈనేపధ్యంలో నిధులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారని బాబు ఆరోపించారు.