హోదాపై ఎంపీలతో జగన్

AP CM YS Jagan with his party MPs'
AP CM YS Jagan with his party MPs’

New Delhi: మనకున్న సంఖ్యాబలాన్ని సమర్థంగా వినియోగించుకొని ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఫలితాలు రాబట్టాలని పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి జగన్‌ దిశానిర్దేశం చేశారు. జగన్ అధ్యక్షతన జరిగిన వైసీపీ పార్టమెంటరీ పార్టీ సమావేశంలో పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల గౌరవం పెరిగేలా సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. అలాగే శాఖల వారీగా రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని కోరారు. నియోజకవర్గాల్లో అవసరాలు దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీలను ఎంపిక చేసుకోవాలన్నారు. ఎంపీలందరూ.. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి సూచనలు తీసుకోవాలని తెలిపారు.