నేడు కర్నూలుకు వెళ్లనున్న సిఎం జగన్‌

ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి వివాహానికి హాజరుకానున్న సిఎం

CM Jagan
CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి వివాహానికి సీఎం జగన్‌ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 01.20 వరకు తిరిగి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్. నేటి కర్నూలు పర్యటనలో ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లోనూ సీఎం జగన్ పాల్గొనరు. కేవలం వివాహ వేడుకుకు హాజరయ్యేందుకు మాత్రమే వెళ్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/