వచ్చే నెలలో మరో మూడు పథకాలు ప్రారంభం

వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం వై ఎస్ జగన్ వెల్లడి

AP CM YS Jagan- Three more schemes
AP CM YS Jagan- Three more schemes

Amaravati: రాష్ట్రంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆధేశించారు.. 104కు ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించాలన్నారు.. వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం సీఎం జగన్‌ సమీక్షించారు.  జర్మన్ హేంగర్లపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలన్నారు. ఆక్సిజన్‌ ఎయిర్ కండిషన్ పెట్టాలి, శానిటేషన్ బాగుండాలన్నారు. రోగులకు మంచి ఆహారం అందించాలని స్పష్టం చేశారు. ఆక్సిజన్ సరఫరా 330 టన్నుల నుంచి 600 టన్నుల సామర్థ్యానికి పెంచామన్నారు. కనీసం రెండ్రోజులకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలన్నారు. ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ జరగాలని తెలిపారు.

జూన్‌లో అమలు కానున్న పథకాలను ప్రకటించారు. జూన్ 8న ‘జగనన్న తోడు’ పథకం, జూన్‌ 15న ‘వైఎస్ఆర్ వాహన మిత్ర’ పథకం, జూన్ 22న ‘వైఎస్ఆర్ చేయూత’ పథకం అమలు చేస్తామని సీఎం తెలిపారు. గ్రామ సచివాలయాల్లో జాబితాలను డిస్‌ప్లే చేసి.. సోషల్ ఆడిట్ తర్వాత మార్పులు, చేర్పులు చేయాలన్నారు. జూన్‌ 31న పశ్చిమగోదావరి జిల్లాలో అమూల్‌-ఏపీ పాల ప్రాజెక్ట్‌ ప్రారంభిస్తామని సీఎం తెలిపారు.

జులై 8న దివంగత సీఎం వైఎస్ఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్బీకేలు ప్రారంభిస్తామని వెల్లడించారు. కొత్తగా నిర్మాణం చేపట్టనున్న మెడికల్ కాలేజీలకు 30న శంకుస్థాపన చేస్తామన్నారు. వచ్చే ఉగాది నాటికి పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలకే ప్లాట్లు అందిస్తామన్నారు. దాదాపు 17 వేల ఎకరాలు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. రకరకాల కేటగిరిల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సేకరణ జరుగుతుందన్నారు. దాదాపు 3 లక్షల మందికి ప్లాట్లు అందిస్తామన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/