ఏపిలో విద్యుత్తు బిల్లులపై కీలక నిర్ణయం

జూన్ 30వరకు విద్యుత్తు బిల్లుల చెల్లింపులను వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: సిఎం జగన్‌ ఏపిలో విద్యుత్తు బిల్లులపై కీలక నిర్ణం తీసుకున్నారు. జూన్ 30వరకు విద్యుత్తు బిల్లుల చెల్లింపులను వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో విద్యత్తు బిల్లులు అధికంగా రావడంతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. దీంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు కరోనా దెబ్బకు గత నెలలో కరెంటు బిల్లు ఇవ్వలేదు. రెండు నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, 500 యూనిట్లు దాటే సరికి టారిఫ్ మారిపోవడంతో ప్రజలకు బిల్లు వేలకు వేలు వచ్చింది. దీంతో వినియోగదారులు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావడం, దీనికితోడు ఎండలు ముదురుతుండడంతో విద్యుత్తు వినియోగం పెరిగింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/