వృద్ధాప్య పింఛ‌ను ద‌స్త్రంపైనే తొలి సంత‌కం

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్‌ కీలకమైన పింఛన్ల పెంపు దస్త్రంపైనే ఆయన తొలి సంతకం చేశారు. వృద్ధాప్య పింఛను రూ.3వేలు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా తొలి ఏడాది రూ.250 పెంచుతున్నట్లు ప్రకటించారు. జూన్‌ 1 నుంచి రూ.2,250 అందజేస్తామని చెప్పారు. రెండో ఏడాది రూ.500, మూడో ఏడాది రూ. 750, నాలుగో ఏడాది రూ. 1000 పెంచి మొత్తం 3వేలు అందజేస్తామన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన నవరత్నాల హామీలను తప్పకుండా అమలు చేస్తామని జగన్‌ ప్రకటించారు.

తాజా ఏపి వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/