ప్రజల చల్లని దీవెనలతో రెండేళ్ల ప్రభుత్వ పాలన
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి

Tadepalli: రాష్ట్ర ప్రజలందరి చల్లని దీవెనలతో రెండు సంవత్సరాల మనందరి ప్రభుత్వ పాలన పూర్తి చేసుకోగలిగామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 1,64,68,591 ఇళ్లు ఉంటే.. 1,41,52,386 ఇళ్లకు (86 %) దేవుడి దయతో ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు.
రెండేళ్ల పరిపాలన పూర్తిపై రెండు డాక్యుమెంట్లను ఆదివారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ విడుదల చేశారు. ఒకదాంట్లో ఒక్కో కుటుంబానికి అందించిన సంక్షేమ పథకాలు, మరో డాక్యుమెంట్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశాం.. అమలుకు చర్యలు తీసుకుంటున్న వాటిపై వివరణ ఇస్తూ ఉంటుంది. ఈ రెండు డాక్యుమెంట్లను వలంటీర్ల ద్వారా ప్రతి గడపకూ పంపిస్తామని సీఎం వైయస్ జగన్ చెప్పారు.


ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.95,528 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని, మరో 36,197 కోట్లు ‘వైయస్‌ఆర్ ఆరోగ్యశ్రీ’, ‘గోరుముద్ద’, ‘జగనన్న విద్యాకానుక’, ‘జగనన్న తోడు’, ‘సంపూర్ణ పోషణ’, ‘ఇళ్ల స్థలాలు’, ‘వైయస్‌ఆర్ కంటి వెలుగు’ ద్వారా ప్రజలకు అందించామన్నారు.
మొత్తం అక్షరాలా రూ.1,31,725 కోట్లు వ్యవస్థల్లో మార్పులు తీసుకువచ్చి లంచాలు, వివక్ష లేకుండా.., నేరుగా ప్రజలకు అందించగలిగామని, ఇంత గొప్ప అవకాశం, గొప్ప పరిపాలన దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో చేయగలిగానని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
తాజా ఆధ్యాత్మిక వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/