పోలవరం ఇంజనీరింగ్‌ కమిటీతో జగన్‌ సమావేశం

y s jagan mohan reddy
y s jagan mohan reddy, ap cm

అమరావతి: తాడేపల్లిలోని తన నివాసంలో ఏపి సియం జగన్‌మోహన్‌రెడ్డి ఇంజనీరింగ్‌ పనుల పునః సమీక్షకు నియమించిన ఉన్నతస్థాయి కమిటీతో సమావేశమయ్యారు. కమిటీ నియమించిన తర్వాత తొలిసారి సమావేశం నిర్వహించిన సియం, ఆ కమిటీ ఎలా పనిచేయాలనే అంశాలపై మార్గనిర్ధేశనం చేశారు. జలవనరుల శాఖతోపాటు, రహదారుల భవనాల శాఖ, మున్సిపల్‌, సీఆర్డీఏ శాఖలోని కాంట్రాక్టులపై అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. వరద ముప్పు ఉన్న ప్రాజెక్టులపై తొలుత సమీక్షించాలని సూచించారు. పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని ఆదేశించారు. టెండర్ల విధానాన్ని పారదర్శకంగా రూపొందించాలని, మన ప్రభుత్వం పారదర్శకత దేశానికి ఒక సంకేతం పంపాలని అన్నారు. అవినీతిని సహించబోమని పై నుంచి కింది స్థాయి వరకు గట్టి సంకేతం పోవాలి. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందరగోళం చేసింది. స్పిల్‌వే పూర్తి చేయకుండానే కాఫర్‌ డ్యామ్‌కు వెళ్లారు. కాఫర్‌ డ్యామ్‌ కూడా పూర్తి చేయకుండా వదిలేశారు. భారీగా వరద వస్తే నాలుగు నెలల పాటు పనులు చేపట్టలేని పరిస్థితి. గత ప్రభుత్వం నిర్వాకం వల్లే ఈ పరిస్థితి అని సియం వివరించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/