రైతులకు ఏపి సిఎం జగన్‌ లేఖ

రైతు భరోసా కింద రెండో ఏడాది రైతుల ఖాతాల్లో రేపు డబ్బులు జమ

jaganmohan reddy
jaganmohan reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌ రైతులకు ఓ లేఖ రాశారు. ‘రైతు భరోసా’ కోసం వరుసగా రెండో సంవత్సరం రైతుల ఖాతాల్లో డబ్బులు రేపు జమ చేయనున్నారు. అయితే ఈనేపథ్యంలో సిఎం అన్నదాతలకు లేఖ రాశారు. ‘ఆత్మబంధువైన అన్నదాతకు నమస్కర్కిస్తూ మీ జగన్ రాస్తున్న ఉత్తరం.. ఏటా ఖరీఫ్ కు ముందే, మే నెలలోనే ఖరైతు భరోసాగ సొమ్మును అందిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ, రాష్ట్రంలో దాదాపు 49 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద వరుసగా రెండో ఏడాది వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు.


‘రైతు భరోసా’  ద్వారా ఏటా రూ.13,500 చొప్పున అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ఈ నెల 30న గ్రామ సచివాలయాల్లో ఖరైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని, నాణ్యత ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇందులో లభిస్తాయని అన్నారు. ఈ కేంద్రాల పక్కనే జనతా బజార్లు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి విధివిధానాలు కూడా రూపొందిస్తున్నట్లు ఆ లేఖలో జగన్ తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/