కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జనవరి 3 నుంచి

CM Jagan
CM Jagan

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జనవరి 3 నుంచి ప్రారంభం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అధికారులకు ఏపి సిఎం జగన్‌ స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలతో జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఫిబ్రవరి చివరి నాటికల్లా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. 2059 రోగాలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తామని సిఎం జగన్‌ అన్నారు. మిగతా జిల్లాల్లో 1259 రోగాలకు ఆరోగ్య శ్రీ పెంచామని జగన్‌ వివరించారు. అంతేకాకుండా జనవరి ఒకటిన ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం అవుతుందని అన్నారు. 2020లో ఇదే తొలి కార్యక్రమం అని సిఎం జగన్‌ అన్నారు. 50 వేలకుపైగా ఉన్న ఆర్టీసి కుటుంబాల దీర్ఘకాలిక కలను నెరవేర్చామని జగన్‌ అన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/