శ్రీ ప్లవ నామ ఉగాది ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలి
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు

Amaravati:: రాష్ట్ర ప్రజలకు , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని,, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగా లని రాష్ట్రం లోని మూడు ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగువారితో పాటు- ప్రపంచం మొత్తం కరోనా పీడ నుంచి శాశ్వతంగా విముక్తం అయ్యేలా దేవుడు చల్లగా చూడాలని కోరారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/