నేడు రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించనున్న సిఎం

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిఎం జగన్ నేడు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీటిని ప్రారంభించనున్నారు. ప్రతి కేంద్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సహాయకులు ఉంటారు. వీరు రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందిస్తారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా అవుతాయి. భూసార పరీక్షలు జరుగుతాయి.

ఇ-క్రాప్‌ బుకింగ్‌కు రైతుకు తోడ్పడతారు. ఏ గ్రామంలో ఎంతమంది రైతులు, కౌలు రైతులు ఉన్నారో గుర్తించి ప్రభుత్వ రాయితీలకు సిఫార్సు చేస్తారు. రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకు పూర్తి అండగా నిలుస్తాయి. రైతులకు విజ్ఞాన, శిక్షణ కేంద్రాలుగా ఆర్బీకేలు పని చేస్తాయి. ఆర్‌బీకేలో వ్యవసాయ సహాయకుడు ప్రతిరోజు పంటలను సమీక్షించి పంపే డేటాను మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షిస్తుంది.10,641 గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/