కీలక దస్ర్తాలపై సంతకం చేసిన సీఎం

jagan
jagan

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్.. మూడు కీలక దస్ర్తాలపై సంతకం చేశారు. ఆశా వర్కర్ల జీతాలను రూ. 10 వేలకు పెంచిన దస్త్రంపై తొలి సంతకం చేయగా, అనంత ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్ర అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేస్తూ జగన్ మూడో సంతకం చేశారు. ఉదయం 11:42 గంటలకు మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.