ఇజ్రాయెల్ పర్యటనలో ఏపి సిఎం జగన్‌

cm jagan in israel
cm jagan in israel

జెరూసలేం: ఏపి సిఎం వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం(ఇజ్రాయెల్) పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. పలు క్రైస్తవ పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇజ్రాయెల్ రైతులతో సమావేశమయ్యారు. తక్కువ నీటితో అత్యధిక దిగుబడి సాధించేదిశగా ఇజ్రాయెల్ రైతులు అనుసరిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. నీటి పొదుపు, పునర్వినియోగం విషయంలోఇజ్రాయెల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎడారిలో ఉన్నప్పటికీ తక్కువ నీటితో భారీ స్థాయిలో దిగుబడిని సాధిస్తోంది.
కాగా, తన నాలుగు రోజుల పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ ఈ నెల 5న విజయవాడకు తిరిగి రానున్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/